హనీమూన్
ఓ మిత్రుడిని కలిసి రావ్ ఇంటికి వచ్చేసరికి భార్య వసంత బాత్రూమ్ లో వుంది. తలుపు తాళం చెవులు తన దగ్గర ఒకటి భార్య దగ్గర ఒకటి ఉంటాయి తాళం కోసం ఇబ్బంది లేకుండా. చప్పుడు చెయ్యకుండా నెమ్మదిగా తాళం తీసి తలుపు మళ్ళీ వేసేసి తమ గది లోకి వెళ్లి చప్పుడు కాకుండా దుస్తులు మార్చుకుని లుంగీ కట్టుకున్నాడు. వంటింట్లోకి వెళ్లి చూసాడు. అన్నీ చక్కని రీతిలో పద్దతి గా పెట్టివున్నాయి. వంట కూడా అయిపోయినట్టుంది. ప్లేటులో మూతపెట్టి టిఫిన్, థెర్మోస్ లో కాఫీ తయారుగా వున్నాయి.
స్నానాలగదిలోంచి మెల్లగా కూనిరాగంతో 'రాకోయి అనుకోని అతిధి ' అన్న పాట వినిపిస్తోంది. తన అడుగుల చప్పుడు వసంతకి వినబడకుండా స్నానాలగది దగ్గరగా నిలబడ్డాడు. మామూ లుగా వున్నప్పుడు పాడమంటే పాడదు వసంత. లోపలినించి నీళ్లచప్పుడు, బకెట్లో మునుగుతున్న మగ్ చప్పుడు, నీళ్లు వంటిమీదనించి జారుతున్న చప్పుడు వినబడుతున్నాయి. పాట మధ్యలో తాళాల్లా. పాట ఆగింది. తువ్వాలు లాగిన చప్పుడు వినబడింది. తుండుగుడ్డ తో వళ్ళు తుడుచుకోవడం వూహించుకున్న రావ్ కి వంట్లో వేడి పుట్టింది. రక్తం వేగంగా పరుగు తీసింది. చెవుల్లోంచి వెచ్చటి ఆవిరి వచ్చింది.
వసంత తలుపుతీసుకొని బయటికి రాగానే వెనకనించి చటుక్కున వాటేసుకున్నాడు. భయంతో కెవ్వున కేకేసింది. భర్తేనని తెలిసేక ముద్దుగా కోప్పడింది. "ఏమిటీ పోకిరి వేషాలు" అంటూ. రావ్ పెదవులతో సమాధానం చెప్పేడు. జుట్టుపట్టి వెనక్కి లాగుతూ మందలిస్తున్నట్లు అంది. "మరీ రోజు రోజుకీ చిన్న పిల్లాడు అవుతున్నారు. ఎంత భయపడ్డానో తెలుసా". పడకగదిలోకి రాబోతున్న రావ్ ని బయటికి నెట్టి తలుపువేస్తూ అంది వసంత. "చీర కట్టుకొని వస్తాను. అందాక బుద్ధిగా వుండండి."
నిరుత్సాహంగా నిట్టూర్చి వంటింట్లోకి వెళ్లి కాఫీని రెండు గ్లాసుల్లో పోసి, టిఫిన్ రెండు ప్లేట్లలో పెట్టి, ముందు గదిలో టీపాయి మీద పెట్టాడు. ఫ్రిజ్ లోంచి నీళ్లు తీసి గ్లాసుల్లో పోస్తుండగా వసంత నీలంచీర కట్టుకుని వచ్చింది. ఆమె పసుపుపచ్చని శరీర రంగుమీద ఆ చీర అద్భుతంగా అనిపించింది రావ్ కి.
తాను వచ్చేసరికి అన్నీ అమర్చిన భర్తని మురిపెంగా చూస్తూ "థాంక్స్" అంది. పొడవాటి జుట్టును దువ్వుకోబోతూండగా దువ్వెన లాక్కుంటూ అన్నాడు రావ్. "కాఫీ వయసు రెండూ ఆలస్యం చేస్తే చల్లారిపోతాయి. నువ్వు పెట్టిన కాఫీ చల్లారిపోతే బాగుండదు. వయసు సంగతి రాత్రి ఆలోచిద్దాం. "
"ఏమిటో గురూగారు మంచి మూడ్లో ఉన్నారీవేళ." అంది వసంత చిత్రంగా కళ్ళెగరేస్తూ.
"మరే !మంచి తెలివైన ఆలోచన వచ్చింది. ఈ నెల ఇరవయ్యారు ఏమిటి?" అడిగాడు రావ్.
"శుక్రవారం" అంది వసంత.
"అదిసరే . జనవరి ఇరవయ్యారు కి ఒక ప్రత్యేకత వుంది".
"ఓ అదా. రిపబ్లిక్ డే " అంది వసంత
"ఎహే అదికాదు. దేశానికి రిపబ్లిక్ డే కావొచ్చు. మరి మనకో?" కొంచం గొంతు పెంచుతూ అడిగేడు రావ్.
వసంతకు నవ్వు వచ్చింది. ఆ రోజు వాళ్ళ పెళ్లిరోజు. స్త్రీలకి మర్చిపోలేని రోజులు, పుట్టిన రోజులు, పెళ్లి రోజు. అవి వాళ్ళకి అంతలా ఎందుకు గుర్తుంటాయో వాళ్ళకే తెలీదు. భర్తని మరి కాసేపు ఆడించాలని కాఫీ చప్పరిస్తూ "మనకా? మనకేంటి?" అంది అమాయకంగా.
రావ్ 'పడ్డాడు'. అతనికి చర్రున కోపం వచ్చింది.
"ఛీ ! నీదింత మట్టి బుర్ర అనుకోలేదు. " అన్నాడు చివాలున లేచిపోతూ. చరచర వెళ్లి పడక గదిలో దూరేడు. తాను ఎంతో ముఖ్యంగా చెప్పాలనుకున్న విషయాన్ని వసంత అంత తేలిగ్గా తీసుకోవడం అతనికి కోపం తెప్పించింది. ఇరవైఆరో తారీఖు ఇంకా నాలుగు రోజులే వుంది. వసంత తో కలసి అరకు వెళదామని ఎన్నో ఆలోచనలు చేసేడతను. కొన్నేళ్ళబట్టి అనుకుంటున్నా ఎప్పుడూ యేవో అడ్డంకులు. చిరాగ్గా స్నానాలగదిలో దూరేడు. టపటప మని శబ్దం చేస్తూ నీళ్లు పోసుకొని పడక గదిలో ఏసీ వేసుకొని మంచం మీద వాలేడు .
నవ్వుకుంటూ గ్లాసులు, ప్లేటులు తీసింది వసంత. "రాత్రికి కూరేంచెయ్యమన్నారు?" అడుగుతూ వచ్చింది వసంత.
జవాబు చెప్పకుండా అటుతిరిగి పడుకున్నాడు. "పోనీ పదండి అలాగ తిరిగివద్దాం. వస్తూ నాగావళి లో టిఫిన్ తిని వచ్చేద్దాం." అంది అనునయంగా.
తిరిగి వద్దాం అన్నమాట విని వెంటనే లేచి తయారయి "పద పద" అన్నాడు రావ్. నవ్వుకుంటూ బయల్దేరింది వసంత.
వసంత తాళం వేసి వచ్చేలోపల స్కూటర్ తీసి స్టార్ట్ చేసి తయారుగా ఉన్నాడు రావ్. వచ్చి వెనకాల కూర్చున్న వసంతాన్ని అడిగేడు. "ఎక్కడకెళదాం?"
"కొత్త బ్రిడ్జి మీదకి పదండి. కాసేపు నాగావళి గాలి అనుభవించి వద్దాం" అంది వసంత.
నాగావళి నది మీద ఒక పాత బ్రిడ్జి ఉండేది. ఇరువైపులా ప్రజలు కూర్చుండి వీలుగా వెడల్పుగా సిమెంట్ తో గట్టు ఉండేది. ఇప్పుడు పాత బ్రిడ్జి స్థానే కొత్త బ్రిడ్జి వచ్చింది నాగావళిలో కొత్త నీరు వచ్చినట్టుగా.. ఆ గట్టు ఇప్పడు లేదు. ఒక రైలింగ్ లాగా ఉంది ఇప్పుడు.
స్కూటర్ ఒక ప్రక్కగా అపి వచ్చే పోయే వాహనాలకు ఆటంకం లేకుండా చూసి, మెల్లగా ఆ బ్రిడ్జి మీద నడవ సాగేరు. చల్లటి గాలి ఆప్యాయంగా వాళ్ళని పలకరించింది. బ్రిడ్జి మీద వాహనాల రాకపోకలు తగ్గుముఖం పట్టాయి . నది వడ్డున వున్న కోటేశ్వరస్వామి కోవెల లోంచి గంటలు వినపడుతున్నాయి. నదిలో నీరు తగ్గి, ఒక చిన్న పాయలా పారుతోంది. మధ్యలో జిబ్రాల్టర్ రాయి మీద బుద్ధుడు హుస్సేన్సాగర్ లో బుద్దుడి విగ్రహానికి తమ్ముడులా నిలబడి శ్రీకాకుళం ప్రజల అడావుడిని గమనిస్తున్నట్టున్నాడు.
బ్రిడ్జికి ఇరువైపులనించి పట్టణంలో దీపాలు వెలుగుతూ కనపడుతున్నాయి.
"ఊరు పెద్దదయిపోతోంది. " అన్నాడు రావ్. శ్రీకాకుళం లో పుట్టి పెరిగిన రావ్ కి శ్రీకాకుళం అంటే ప్రాణం. ఉద్యోగరీత్యా ఎక్కడికెళ్లినా వీలైనంత త్వరగా శ్రీకాకుళం బదిలీ చేయించుకుని వచ్చేసేవాడు. వసంతకు కూడా శ్రీకాకుళం అంటే చాలా ఇష్టం. రావ్ పుట్టిన ఊరని. రావ్ కి నచ్చే వూరని.
"ఇంతకీ మీరేమిటి చెప్పాలనుకున్నది?" అడిగింది వసంత. ఇంకా కోపం పోనట్టు మౌనంగా ఉండిపోయేడు రావ్. "చెప్పండి ప్లీజ్" అంది వసంత.
"ఇరవైఆరు ఏమిటి?" మళ్ళీ అడిగేడు రావ్.
"ఈ అబ్బాయిగారికి ఒక మంచిపిల్లతో పెళ్లిఅయిన రోజు. " అంది వసంత రావుకి మాత్రమే వినబడేటట్లు.
"కదా.. అందుకే మనం ఈసారి అరకు వెళ్లి మన పెళ్లి రోజు గడుపుదాం" అన్నాడు రావ్.
"నిజంగా! వావ్" సంతోషంగా అంది వసంత . "అలాగే. కానీ అక్కడ గదులు, ప్రయాణానికి ఏర్పాట్లు చెయ్యడానికి టైం సరిపోతుందా" అంది వసంత.
ఆ బ్రిడ్జి పిట్టగోడని పట్టుకుని నిలబడి, గుడి వైపు చూస్తూ అన్నాడు రావ్. " నీకు మన పెళ్లి రోజు గుర్తుందా.. నా పెళ్లికాక ముందు పెళ్లయినాక హనీమూన్ కి అరకు వెళ్లాలని నా కల. పెళ్ళైన ఇన్నేళ్లయినా ఆ కల తీరలేదు. నా భార్యతో వెళ్లాలని నేనింతవరకు ఎన్నోసార్లు అవకాశం వచ్చినా అరకు వెళ్ళలేదు. అందుకే ఈసారి అన్నీ ముందుగా ఏర్పాటు చేసేసేక నీకైనా చెప్పాలి అనుకున్నాను. అక్కడ ఉండటానికి, రానూ పోను టికెట్స్ అన్ని బుక్ చేసేసేను. ఇప్పుడు ఏ కారణం చెప్పినా ఆగేది లేదు. ఇరవైఅయిదు న వైజాగ్ నుంచి గ్లాస్ ట్రైన్లో టిక్కెట్టు కొన్నాను. అది ఉదయాన్నే సుమారు ఏడు గంటలకి బయల్దేరుతుంది కనక ముందు రోజు రాత్రి వైజాగ్ వెళ్లి విస్సుగాడి ఇంట్లో ఉండి స్టేషన్ కి బయల్దేరుతాము. వాడికి చెప్పలేదు. కానీ వస్తున్నామని ఇరవైనాలుగు తారీకు న చెప్తాను. "
"ఆలా ఎందుకు? ఏదైనా హోటల్ లో ఉండచ్చుగా" అంది వసంత.
"సరే అలాగే చేద్దాం. ఇరవైఐదున సుమారు పన్నెండు గంటలకి చేరటం. ఇరవైఆరు పూర్తిగా అక్కడే వుంది, ఇరవై ఏడున మళ్ళీ మధ్యాహ్నం సుమారు నాలుగు గంటలకి రిటర్న్ అవుతాం వైజాగుకి.రాత్రి ఎనిమిదిన్నరకల్లా వచ్చేస్తాం కనక బస్టాండ్ కి వచ్చి బస్సు పట్టుకుని వచ్చేయచ్చు. ఏమంటావు?" అన్నాడు రావ్.
"బాగుంది ప్రోగ్రాం అలాగే వెళదాము. అక్కడ ఏమైనా తినడానికి తయారు చేస్తాను. మీరు హోటల్ భోజనం సరిగ్గా చెయ్యరు." అంది వసంత.
ఇద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోయేరు. ఏమిటి తయారు చెయ్యాలా అని ఆలోచనలో వసంతా.. రాబోయే ప్రయాణంని ముందుగా ఊహించుకుంటూ రావ్ . గాలి వీచడం కొంచం తగ్గింది. మెల్లగా వెనక్కి తిరిగారు ఇద్దరు. స్కూటర్ దగ్గరకు వచ్చి, నాగావళి హోటల్ కి చేరి అల్పాహారం కానిచ్చి ఇంటికి చేరేవరకు, రావ్ చాల ఉద్విగ్నతతో తన కలలని అవి సాకారమయ్యే సమయం వచ్చినందుకు యెంత ఆనందంగా ఉందో చెప్తూనే వున్నాడు.
వసంతకి తమ పెళ్లి జరగడానికి దారి తీసిన సంఘటనలు గుర్తుకు వచ్చాయి. తన జీవితంలో మొట్టమొదటి పెళ్లి చూపులు అవి. రావ్ తో. అవే ఆఖరివి అవడం తన అదృష్టం. రావ్ తల్లి తోటి, అక్కతోటి వచ్చేడు. నెమ్మదిగా తలెత్తి చూసి 'బాగున్నాడు' అనుకుంది. కానీ తాను చూస్తుండగా అతను తనని చూడలేదు. చూసేడో లేదో అనుకుంది. చాలా సంప్రదాయబద్దంగా జరిగేయి పెళ్లి చూపులు.
తరువాత బ్యాంక్ లో చలాన్ కట్టడానికి వెళ్ళినప్పుడు కౌంటర్ లో రావుని చూసి తడబడింది కొంచెం. రావ్ కూడా ఆశ్చర్యంగా చూసేడు. చలాన్ నింపడానికి వివరాలు అడుగుతున్నప్పుడు, తనతో మాట్లాడుతున్నప్పుడు గొంతులో చిన్న వణుకు, ఆ "బ్లష్ " అవడం అంతా గుర్తున్నాయి. తనని నిలబెట్టి పనంతా ముగించి రసీదు తీసుకువచ్చి మెల్లగా అన్నాడు. "కాఫీ తాగుదామా" మళ్ళీ గబగబ అతనే అన్నాడు "మీకభ్యంతరం లేకపోతేనే."
నిజానికి తనకప్పుడు చాల భయం వేసింది. అయినా సరేనన్నట్లు తలవూపింది. అకౌంటంట్ దగ్గర అనుమతి తీసుకుంటుంటే అనుకుంది. "అతనేమిటి మాట్లాడతాడు? ఏమిటి అడుగుతాడు? నువ్వు నాకు నచ్చావ్ అని చెప్తాడా? నా అభిప్రాయం అడుగుతాడా? తన నిర్ణయం చెప్తాడా?"
హోటల్ లో కూర్చున్నాక, కాఫీకి ఆర్డెరిచ్చి అన్నాడు రావ్. "మీకు నేను నచ్చానా వసంత గారు?" మళ్ళీ గొంతులో అదే వణుకు. బహుశా ఆడపిల్లలతో మాట్లాడటం మొదటిసారి కాబోలు అనుకుంది. మెల్లిగా తల ఊపింది.
"చూడండి. మీరు వేరేగా అనుకోకండి. మనం పెళ్లి చేసుకుంటే ఆనందంగా ఉండగలమని మీకు అనిపిస్తేనే ఒప్పుకోండి . నాకెందుకో మీరే నా జీవిత భాగస్వామి అనిపించింది. అదోరకమైన భావన. మీరు ఒప్పుకోరేమోనని భయపడ్డాను కూడా. థాంక్ గాడ్." అన్నాడు ఆనందంగా. కాఫీ వచ్చింది. తాగుతున్నంతసేపు ఏమి మాట్లాడలేదు వసంత.
"థాంక్యూ! థాంక్యూ వెరీ మచ్ " అంది బయటకు వచ్చేక. తలూపి గబగబా వెళ్ళిపోయాడు రావ్. వెనక్కి తిరిగి చూస్తాడేమోనని అనుకుంది. బ్యాంక్ లోకి అతను వెళ్లిపోయేక ఇంటి ముఖం పట్టింది.
నెలరోజులు తిరగకుండా వాళ్ళ పెళ్లి అయిపొయింది. వాళ్ళ మొదటి రాత్రి గందరగోళం గా జరిగింది.
వాళ్లిద్దర్నీ గదిలోకి పంపించేక రావ్ వసంత ఒకరినొకరు చూసుకుంటూ అలాగే నిలబడ్డారు. మెల్లిగా రావ్ వసంతాన్ని దగ్గరికి తీసుకొని ముద్దుపెట్టుకోబోతు, "ఏమి అనుకోవు కదా" అని అడిగేడు.
నవ్వొచ్చింది వసంతకి. రాత్రంతా ఇలాగే అనుమతులు అడుగుతాడా అని. వాళ్ళిద్దరికీ మొదటి ముద్దు ఒక మధురానుభవం. మెల్లగా వసంతాన్ని మంచం మీద కూర్చోబెట్టాడు రావ్. ఆమె వడిలో తలపెట్టుకొని పడుకుంటుండగా స్పష్టంగా వినబడింది.
కిర్రుమన్న శబ్దం.
ఇద్దరు తుళ్ళిపడి చూసేరు. ఆ మంచం కీళ్లు కొంచెం ఒదులు . మంచం మీద పడుకున్నా కూర్చున్న కొంచం కదిలినా కిర్రున శబ్దం చేస్తుంది.
కాస్సేపాగి మళ్ళీ ప్రయత్నం చేసేడు. ఈసారి కొంచం నెమ్మదిగా కూర్చొని జరిగేడు. మళ్ళీ కిర్రుమంది. ఇద్దరికీ ఫక్కుమని నవ్వు వచ్చింది. కానీ అంతలోపు పక్క గదిలో బంధువులున్నారు గుర్తొచ్చి ఆపుకున్నారు. మంచం మీంచి పరుపు తీసి కిందని వేశారు. హాయిగా నిట్టూర్చి వసంతకి మరో పెద్ద ముద్దిచ్చి ఆమెని గట్టిగా వాటేసుకున్నాడు.
"లైటు" అంది రావ్ చెవిలో వసంత. రావ్ లేచి లైట్ ఆర్పేశాడు. ఆ గదిలో బెడ్ లైట్ లేదు.
ఆడవాళ్ళకి కొందరికి కొన్ని విచిత్రమైన భయాలుంటాయి. కొందరికి బొద్దింకలు చూస్తే భయం. కొందరికి బల్లిని చూస్తే భయం. పిల్లిని చూస్తే వొళ్ళు జలదరిస్తుంది కొందరికి.
వసంతకి ఎలుకలంటే ప్రాణ భయం.
రావ్ వసంత తమ ఆనంద సామ్రాజ్యం లో హాయిగా విహరిస్తుంటే ఓ ఎలక సహించలేక పోయింది. మెల్లగా, అతిమెల్లగా ఆ ఎలక వసంత కాలిమీదనించి ఒక ఎగురు ఎగురుతూ మధ్యలో ఆమె చిటికిన వేలిని కొద్దిగా రక్కింది.
వసంత "కెవ్" మంటూ లేచి కూచుంది. రావుకి గుండె ఆగినంత పనయ్యింది. లేచి లైటేసాడు. ఎలక మీసాలని అల్లల్లాడించి పెట్టె కిందకి పారిపోయింది.
"ఏం నాయనా? ఏమైంది?" మామగారి గొంతు వినబడింది అవతలనించి.
"ఏం లేదు. " అన్నాడు గాభరాగా. వసంత సిగ్గుతో దుప్పటి కప్పుకుని కూచుంది.. లైటుంచితే సిగ్గు, లైట్ ఆర్పితే ఎలకలు. లైట్ వేసుకుని రావ్ నిద్రపోయేడు. వసంతకి మాత్రం ఆ రాత్రంతా జాగారం అయింది.
మర్నాడు వసంత తండ్రి ఆ మంచం చూసి కేకలు వేసి, మరో మంచం వేయించేడు. ఆ రోజు రాత్రి వాళ్ళ జీవితంలో తొలి రాత్రి అయ్యింది.

ఇల్లు చేరేరు. తలుపు తీసుకొని వస్తుంటే వసంత నవ్వుకోవడం గమనించి అడిగేడు రావ్. "ఏమిటి?."
"మన మొదటి రాత్రి, గది . కిర్రు మంచం. ఎలక" అంది వసంత. రావ్ కి నవ్వొచ్చింది. ఆ సంఘటన తలుచుకున్నప్పుడల్లా వారిద్దరూ నవ్వుకుంటుంటారు.
**************
రావ్ ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఇద్దరు సాయింత్రం శ్రీకాకుళం నుంచి వైజాగ్ బస్సు ఎక్కి బయల్దేరేరు. సరిగ్గా వంద కిలోమీటర్లు వైజాగ్. బస్సు లో పక్క పక్క కూచున్నాక వసంత తో అన్నాడు రావ్. "యెంత ఎక్సయిటింగ్ గా ఉందొ తెలుసా". మెల్లగా చెయ్య మీద చెయ్యవేసి సున్నితంగా నొక్కింది.
వైజాగ్ లో ఒక హోటల్ లో రూమ్ తీసుకుని పడుకున్నారు. మర్నాడు ఉదయాన్నే లేచి తయారయి స్టేషన్ కి వెళ్లి, గ్లాస్ ట్రైన్ లో వాళ్ళ సీట్స్ లో కూర్చున్నారు. పైనించి, ప్రక్కనించి కనబడే ప్రకృతి అందాలు చూస్తూ, ఆనందిస్తూ బొర్రా గుహలు స్టేషన్ చేరేసరికి రావ్ కి కొంచం అసౌకర్యంగా అనిపించింది. ఎన్నాళ్ళనుండో ఎదురు చూస్తున్న క్షణం కదా ఉద్విగ్నత వల్ల అని అనుకున్నాడు. కొంచం సేపటికి మళ్ళీ మామూలుగా అనిపించింది.
అరకులో దిగి తాము బుక్ చేసుకున్న బంగాళా దగ్గరికి రిక్షా లో వెళ్ళేరు. రూంలో దిగి అలా అలసటగా అనిపించి వసంత కొంచం తయారు అయి వస్తానని స్నానాలగదిలోకి వెళ్ళింది. రావ్ అలా మంచం మీద పడుకున్నాడు.
ఎంతసేపు అయిందో మెల్లిగా కళ్ళువిప్పి చూడటానికి ప్రయత్నం చేస్తే, కళ్ళు విడడం లేదు. చాలా మత్తుగా అనిపించింది. ఎవరివో గొంతులు వినబడుతున్నాయి. ఒక గొంతు వసంతది లాగ వుంది. ఎవరితోటో మాట్లాడుతోంది. మళ్ళీ నిద్ర పట్టేసింది.
మళ్ళీ తెలివి వచ్చేసరికి చీకటి పడ్డట్టుగా వుంది. దాహంగా అనిపించి లేవాలి అనుకున్నాడు. కానీ లేవలేకపోయాడు. 'దాహం' అని గట్టిగా అన్నాడు. కానీ తన గొంతు తనకే నీరసంగా వినపడింది.
"ఇదిగో కొంచం నీళ్లు తాగండి" అంటూ వసంత గ్లాస్ తో నీళ్ళని తన గొంతులో పోసింది. మళ్ళీ నిద్ర పట్టేసింది.
ఈసారి తెలివి వచ్చేసరికి "ఏమండీ ఎలావుందీ? " అని అడుగుతూ ఆందోళనగా చూస్తున్న వసంత మొహం కనబడింది. "అమ్మయ్య తెలివి వచ్చిందా" అంటూ తన చేతిమీద చెయ్యి వేసి భరోసా ఇస్తున్నట్టు తట్టింది.
కళ్ళు పూర్తిగా విడివడ్డాయి రావ్ కి. చుట్టూ చాలామంది ఉన్నారు. కొడుకు, కోడళ్ళు, డాక్టర్, నర్సులు, మిత్రుడు విశ్వనాధం. "ఏమిటి అయింది? నాకు?" అంటూ లేవబోయిన రావుని కొడుకు "లేవకండి నాన్నగారు" అంటూ వారించేడు. మళ్ళీ నిద్ర పట్టేసింది రావ్ కి.
మర్నాడు ఉదయం తెలివి పూర్తిగా వచ్చింది రావుకి. కొడుకు పక్క కుర్చీలో నిద్రబోతున్నాడు. రావ్ లేచిన అలికిడికి లేచేడు.
"ఏమైంది నాకు" అని అడిగేడు. తన వంటిమీద ట్యూబ్ లు చూసుకున్నాడు. చుట్టును చూసేడు. తాను హాస్పిటల్ లో ఉన్నట్టు అర్ధం అవుతున్నది.
" థాంక్ గాడ్ నాన్న. మీకు శుభాకాంక్షలు చెప్దామని, ఇరవైఅయిదవ తారీకు రాత్రి ప్రయత్నించడం మేలైంది. మీ ఫోన్ ఏది దొరకకపోతే, విశ్వనాధం అంకులు కి ఫోన్ చేసేను. ఆయనకీ మీరెప్పుడో అరకులో బంగళా గురించి అడగటం, ఇంతలో అమ్మ పబ్లిక్ ఫోన్ నుంచి ఫోన్ చేయడం తో ఆయన వెంటనే ఆంబులెన్స్ తో వచ్చి మిమ్మల్ని వైజాగ్ తీసుకు వచ్చేరు. మీకు స్ట్రోక్ వచ్చింది అని వెంటనే సర్జరీ చెయ్యాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు ఓకే. నేను తమ్ముడు, పిల్లలం అందరం వచ్చేము." అన్నాడు రావ్ కొడుకు.
ఇంతలో రావు కోడళ్ళు, పిల్లలు, వసంత అందరు లోపలి వచ్చేరు. వసంత మొహంలో ఆ క్షణం లో కనబడ్డ రిలీఫ్ రావ్ కి ఆమె ఎంత ఆందోళనకి గురయ్యిందో చెప్పింది. డాక్టర్ వచ్చి చెక్ చేసి ఇంకేమి ప్రమాదం లేదని, రెండు మూడు రోజుల్లో ఇంటికి వెళ్లిపోవచ్చని చెప్పాడు.
అందరూ రావ్ ని వసంతని గదిలో వదిలి బయటకి వెళ్ళేరు.
నీరసంగా అన్నాడు రావ్ "మన హనీ మూన్ ఇలా అయిందా?."
"పోనీ లెండి. మీరు క్షేమంగా ఉన్నారు అంతేచాలు. దేవుడి దయ. \" అంది వసంత.
బయటనుండి పెద్దకోడలు కొడుకుతో అంటున్న మాటలు వినబడ్డాయి. "విచిత్రం కాకపొతే ఈ వయసులో హనీమూన్ ఏమిటి?"
"ప్రేమకి వయసుతో నిమిత్తం లేదు. వాళ్ళ మధ్య అనురాగం అటువంటిది. " అంటున్నాడు పెద్దకొడుకు.
మత్తుగా నిద్రలోకి జారిపోతూ అనుకున్నాడు. "అవును. ప్రేమకి వయసుతో నిమిత్తం లేదు. ప్రేమించే మనసు ఉంటే చాలు".
మళ్ళీ నిద్ర పట్టేసింది రావుకి.
============ అయిపొయింది. ==========
పెళ్ళిరోజు తలచుకుంటేనే స్ట్రోక్ వచ్చేంత సస్పెన్స్ తో అదరగొట్టేరు శర్మగారూ, చూస్తే ఇది మీ స్వీయచరిత్రలా అనిపిస్తోంది!
ReplyDeleteధన్యుడ్ని. స్వీయానుభవం అయితే మాత్రం కాదు.
Deleteమీలో ఇంత రచనా శక్తి ఉంది కూడా ఇన్నాళ్లు మీ కలాన్ని దూరం ఎందుకు పెట్టేరు శర్మగారూ! మీరు తరచూ మరిన్ని రాయాలని ఆశ పడుతున్నాను....soni
ReplyDeleteNayam, oka kshanam gaabara pettaru
ReplyDelete_satyasri